Bigg Boss Naga Manikanta : బిగ్ బాస్ నాగ మణికంఠ పెళ్ళి వీడియో వైరల్!
on Sep 8, 2024
బిగ్ బాస్ సీజన్ 8 గ్రాంఢ్ గా మొదలైంది. ఇక వారం గడిచిపోయింది. ఇందులో సెంటిమెంట్ కార్డ్ ని వాడి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ తీసుకుంది నాగ మణికంఠ. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఎక్కువగా వినిపించిన పేరు మాత్రం నాగ మణికంఠ. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్‌లోకి అడుగుపెట్టి.. తన స్పెషల్ వీడియోలోనే కష్టాలను చెప్పుకుని హైలైట్ అయ్యాడు.
మణికంఠ తన భార్య, కూతురు గురించి స్పెషల్ వీడియోలో ఒకలా చెప్తే.. హౌస్‌లోకి వెళ్లిన తరువాత.. మరోలా మాట్లాడాడు. తన భార్య.. యూఎస్ నుంచి వెళ్లిపొమ్మన్నదని చెప్పగా.. మణికంఠ భార్య నెగిటివ్ అయ్యింది. హౌస్‌లోకి వెళ్లిన తరువాత తన భార్య బంగారం అని మణికంఠ హౌస్‌లోకి వచ్చాడంటే తన భార్య వల్లేనని ఆమే తనకి షాపింగ్‌కి డబ్బులు కూడా పంపి వెళ్లు నాన్నా అని ప్రోత్సహించిందని చెప్పాడు. అంతేకాదు తన భార్యతో తనకి ఎలాంటి గొడవలు లేవని చిన్నచిన్న మనస్పర్థల వల్లే తాను భార్య కూతురికి దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పాడు.
హౌస్‌లో కూడా తన భార్యని గుర్తు చేసుకుని మిస్ యూ మిస్ యూ అంటున్నాడు నాగ మణికంఠ. అంటే వీరిద్దరి మధ్య గొడవలేం లేవని, అందరు నామినేట్ చేయడంతో ఓ కట్టుకథ అల్లాడంటూ అందరు అనుకుంటున్నారు. నాగ మణికంఠ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్య ఫొటోలు కానీ... పెళ్లి ఫొటోలు, వీడియోలు లేవు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేజ్‌లలో మణికంఠ పెళ్లి వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో మణికంఠ భార్య ప్రియను చూడొచ్చు. ఆమె మణికంఠకి సరైన జోడీనా.. వీళ్ల జంట ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి.
Also Read